సౌత్ ఇండియన్ హీరోలైన రజినీకాంత్, కమల్‌హాసన్ కెరీర్ దాదాపు ఒకేసారి ప్రారంభమైంది. ఇద్దరూ కె.బాలచందర్ సినిమాల ద్వారానే బాగా పాపులర్ అయ్యారు. ఎన్నో సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు కూడా. తమ పెర్ఫార్మెన్స్తో తమిళ్లోనే కాదు, తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకొని అభిమానుల్ని సంపాదించుకున్నారు. రజినీకాంత్ పక్కా కమర్షియల్ సినిమాల వైపు వెళితే, కమల్‌హాసన్ ఎక్స్పెరిమెంట్ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కమల్‌హాసన్‌కి జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన సినిమా మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ‘నాయకుడు’. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో మమ్ముట్టి కాంబినేషన్లో చేసిన ‘దళపతి’ రజినీకాంత్‌కి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత రజినీకాంత్, కమల్‌హాసన్‌లతో మళ్ళీ సినిమా చెయ్యలేదు మణిరత్నం.