హైదరాబాద్: ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇరుకున పెట్టడం సహజం. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందుకు భిన్నంగా పరిస్థితి కనబడుతున్నది. ప్రభుత్వ వ్యూహంతో ప్రధాన ప్రతిపక్షం విలవిలలాడుతున్నది. పలు విచారణ కమిషన్లు, సంస్థలు చేపట్టిన వరుస విచారణలు బిఆర్ నాయకులను, ముఖ్యంగా కెసిఆర్, కెటిఆర్, హరీష్ చికాకుపరుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం మొదలు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన బిఆర్ (గతంలో టిఆర్ చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతుండడమే ఇందుకు కారణంగా కనబడుతున్నది. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాసేవే ప్రభుత్వ లక్ష్యమని పలుమార్లు సిఎం, టిపిసిసి అధ్యక్షుడు, ఇతర ముఖ్య నేతలు ప్రకటించారు. అయితే గత పదేళ్ల పాలనలో బిఆర్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలను మాత్రం వదిలిపెట్టేదిలేదని, అందుకు తగిన శిక్షను వారు అనుభవించాల్సిందేనని కూడా వారు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా సాదాసీదాగా వ్యవరించినప్పటికీ గత కొంత కాలంగా ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం బిఆర్ చేస్తున్న విమర్శలను సమర్ధవంతంగానే తిప్పి కొడుతున్నది. ప్రతిపక్ష బిఆర్ ప్రభుత్వం తనదైన శైలిలో విమర్శల దాడిని ఎక్కుపెట్టింది. బిఆర్ దశ దిశా లేకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని, కెసిఆర్ పాలనలో రాష్ట్రానికి మిగిలింది అప్పుల భారం మాత్రమేనని, పదేళ్ల పాలనలో కెసిఆర్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపాన పోలేదని, డబుల్ బెడ్ రూమ్ వాగ్దానం చేసిన కెసిఆర్ ఒక్క ఇల్లు ఇవ్వలేదని విమర్శలు గుప్పిస్తున్నది. మరోవైపు ప్రభుత్వం బిఆర్ నేతల అవినీతి, అక్రమాల చరిత్రను తోడుతోంది. అందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నేపధ్యంలో కాళేశ్వరం ప్రాజోక్టులో అవినీతి, అవకతవకలపై విచారణకు జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ ఏర్పాటు, విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్తు కొనుగోలులో అవకతవకలపై విచారణకు జస్టిస్ లక్ష్మినారాయణరెడ్డి కమిషన్ ఏర్పాటు, ఫార్ములా ఈ కార్ రేస్ రూ.50 కోట్ల అవినీతిపై ఎసిబి విచారణ, జిఎస్ కుంభకోణంపై సిఐడి విచారణ ఇలా ప్రభుత్వం పలు విచారణలను వేగవంతం చేయడంతో బిఆర్ నేతలు, ముఖ్యంగా మాజీ సిఎం కెసిఆర్, ఆయన కుమారుడు, అల్లుడు అయిన మాజీ మంత్రులు కెటిఆర్, హరీష్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ధరణి పేరుతో భూముల అక్రమాలను కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యవసాయ, రైతు కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా సాగుభూముల విషయంలో జరిగిన అవకతవకలను వెల్లడించేందుకు చర్యలు చేపట్టింది. ఇలాంటి అనేక విచారణలు కొనసాగుతుండడంతో ‘కారు’ నేతలతో కంగారు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కొంగుబాటుపై విచారణ కమిషన్ ఏర్పాటు బిఆర్ నాయకులతో పాటు అప్పటి అధికారులపై విచారణను వేగవంతం చేసింది. అందులో భాగంగా అప్పటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ అంతకుముందు నీటిపారుదల శాఖ బాధ్యతలను నిర్వర్తించిన సిఎం కెసిఆర్ కూడా కమిషన్ విచారించింది. దీంతో ఎప్పుడూ ఫామ్ హౌస్ వదిలి బయటకు రాని కెసిఆర్ విచారణ కమిషన్ ముందు నిలబెట్టడంతో బిఆర్ శ్రేణులు ఒక్క సారిగా ఖంగుతిన్నాయి. కాగా ఫార్ములా ఈ కార్ రేస్ రూ.50 కోట్ల అవినీతి విషయంపై విచారణ చేపట్టిన ఎసిబి మాజీ మంత్రి కెటిఆర్ మూడు సార్లు విచారించింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని, ఇరుకున పెట్టాలని భావించాలని బిఆర్ ఒక వైపు కెసిఆర్ కవిత లేఖతో అంతర్గత సమస్యలను ఎదుర్కొంటుండగా, మరోవైపు విచారణ కమిషన్ వరుస విచారణలతో ముఖ్యంగా కెసిఆర్, కెటిఆర్, హరీష్ పాటు బిఆర్ నాయకులు, శ్రేణులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై బిఆర్ చేసిన విమర్శలపై సిఎం రేవంత్ వాస్తవాలను వెల్లడిస్తూ చేసిన విమర్శలు, ఆయన స్పందన ఇందుకు నిదర్శనం. తద్వారా ప్రజా కోర్టులో కెసిఆర్ దోషిగా నిలబెట్టినంత పనిచేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.