prajapaksham

లడ్డూ ప్రసాదం కల్తీ కేసు.. వైవీ సుబ్బారెడ్డి పీఏకు సిట్ నోటీసులు

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసును సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో  ఏర్పాటైన ప్రత్యేక  దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి పిఏ గా  పని చేసిన అప్పన్నకు అప్పన్నకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. బుధవారం (జూన్ 4( నుంచి మూడు రోజులు పాటు తిరుపతి లోని సిట్ కార్యాలయంలోఅప్పన్నను సీట్ అధికారులు విచారిస్తారు.

త్వరలో మాజీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి, మాజీ ఈవో  ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. టీటీడీ మాజీ జేఈవో   సహ ఇతర అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్..  ఈ కేసుకు సంబంధించి  మరికొందరిని  అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.సిట్ దర్యాప్తులో భాగంగా నెయ్యి సరఫరాకు తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ దక్కించుకున్న తమిళనాడు  దిండుగల్ కు చెందిన ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేయలేదని తేలింది.  ఉత్తరాఖండ్   రూర్కీలోని బోలేబాబ డైరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసి తిరుపతి జిల్లా లోని వైష్ణవి డైరీకి తరలించారు.  అక్కడ ఏఆర్ డైరీ సీల్   వేసి టీటీడీకి సరఫరా చేశారని సిట్ దర్యాప్తులో తేలింది.  

Recent Post

Andhra Pradesh National