ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను బుధవారం (జూన్ 4) జైలు నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పీఎస్సార్ ఆంజనేయులు హై బీపీతో బాధపడుతుండటంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మళ్లీ జైలుకు తరలిస్తారు. ఇదే సమస్యతో ఆంజనేయులును గత నెల 31న ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించిన అధికారులు చికిత్స అనంతరం తిరిగి జైలుకు తరలించారు.