తెలంగాణలో నూతన యుగ ఆవిష్కరణ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. విప్లవాల నీరు కారిపోకుండా, వేయకుండా కొనసాగింపులో ఉన్న అద్వితీయ ప్రస్థానం తెలంగాణలో ఆవిష్కృతమవుతోంది. సాయుధ, ప్రజాస్వామిక రూపాలతో ఉద్యమజ్వాలను రగిలిస్తూనే ఉంది. నిజాం విధానానికి వ్యతిరేకంగా ప్రారంభమై, బలపడిన ప్రజా ఉద్యమం సాయుధ పోరాటం. పాలనా యూనిట్లు కలిగివున్న నిజాం రాజ్యంలో ఉన్న ఒక ప్రాంతం విస్నూరు. దేశముఖ్ పేరు రాపాక రామచంద్రారెడ్డి. గ్రామం ఇతని అధీనంలో ఉండేది. కడవెండి అనే గ్రామం ఉంది. గ్రామంలోనే దేశముఖ్ తల్లి జానమ్మ ఉండేది. తన అకృత్యాలను కొనసాగిస్తూ ఉండేది. ఎకరాల సాగును 400 వందల ఎకరాలకు చేర్చింది. గ్రామాలలాగే కడవెండి కూడా రాచరిక పాలన దుష్ఫలితాలను అనుభవిస్తోంది. మహాసభ, పార్టీ ప్రవేశించకముందే ఈ గ్రామం దేశముఖ్ అకృత్యాలను, పెత్తందారీ సంస్కృతిని విమర్శించడం, ధిక్కరించడం మొదలుపెట్టింది. చైతన్యంతో అన్యాయాలకు వ్యతిరేకంగా సంఘటితమైంది.
1944లో భువనగిరి రావి నారాయణ రెడ్డి ఆంధ్ర మహాసభ పిలుపుతో కడవెండి గ్రామం అగ్నిశిఖగా మారింది. సంఘటిత శక్తికి భరోసా ఉందని, భూమి, పన్నుల రద్దు వంటి కమ్యూనిస్టు నినాదాలతో ప్రేరితమై అక్రమాలను ఎదుర్కోవడం కోసం దొడ్డి కొమురయ్య, నరిసింహ రెడ్డి, నర్సోజీ రెడ్డి వంటి వారితో గ్రామ రక్షణ కమిటీ ఏర్పడింది. వజ్ర మహిళా దళం ఏర్పడింది. కొముర మల్లయ్య సోదరుల నాయకత్వంలో కడవెండి ఒక తిరుగుబాటు తోటగా మారింది. విరుగకాయు పళ్లలాగ… ఎంత బాధిస్తే అంత ఎర్ర నౌతాము అని చాటి చెప్పింది. వారి గుండాల ఆగడాలకు దెబ్బకు దెబ్బ రీతిలో సమాధానం చెపుతోంది. ఐలమ్మ కౌలు పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి విజయం సాధించింది. లేత యవ్వనంలో ఉన్న కొమురయ్య కమ్యూనిస్ట్ శిక్షణ శిబిరాలలో కర్రలు, ఒడిసెలు వంటి ఆయుధాల సాయుధ శిక్షణలో, అవగాహనలో ఆరితేరాడు. సంఘాలు ఏర్పడి పాలకుర్తి పరిసర ప్రాంతాలకు విస్తరించడంలో కొమురయ్య చైతన్యవంతంగా పాల్గొన్నాడు.
‘మన మన చెమట మాగాణిని తడుపుతాయి’ ఏతము ఎత్తి వెయ్యి పుట్లు పండిస్తాము, ఒక మెతుకు ఎరగం అంటూ… మీద బతుకలేము, మంటను భరించలేము, తెగించి పోరాడుదాం అని కొమురయ్య ప్రజల్లో ప్రచారం చేశాడు. క్రమంగా కడవెండి గ్రామానికి జూలై 4న నిజాం రాజ్య రెవెన్యూ అధికారులు లెవీ ధాన్యపు సేకరణకు రావడం జరిగింది. దగ్గర తిండికి ధాన్యం లేదని, లెవీ సేకరణకు ఒక్క గింజ లేదని రైతులు, కూలీలు తేల్చి చెప్పారు. గ్రామంలో కల జానమ్మ దొరసాని ఇంట్లో 800 బస్తాల ధాన్యం ఉందని, దానిని సేకరించమని చెప్పారు. గిడ్డంగులను కాపలా కాస్తున్న దొర గుండాలలకు వ్యతిరేకంగా కడవెండి గ్రామంలో పెద్ద ఊరేగింపును గ్రామ కమిటీ నిర్వహించింది. మిస్కిన్ అలీ నేతృత్వంలో దొర గుండాలు కాల్పులు జరిపారు. నాయకత్వం వహిస్తున్న కొమురయ్య గుళ్ల వానకు బెదరలేదు. తూటాలు తూటలుగా తగిలినా ఆంధ్ర మహాసభకి జై, కమ్యూనిస్టు పార్టీకి జై అంటూ ప్రాణాలు వదిలాడు. ఇంకా అనేక మందికి గాయాలయ్యాయి. ఈ వీరమరణం తెలంగాణ చరిత్రను నూతన యుగంలోకి తీసుకెళ్లింది. కొమురయ్య అంత్యక్రియలకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. అమరుడిగా నిలిచిపోయాడు. వీరభూమిగా మారి లక్షలాది ప్రజలకు స్ఫూర్తిని ఇచ్చింది. తిరుగుబాటును ఎలా నడపాలో, ఎలా లేపాలో అనేది కడవెండి నమూనాగా నిలిచింది.
కొమురయ్య అమరత్వాన్ని గానం చేస్తూ, పెను మంటల ఎర్ర జెండాలను మోస్తూ, ప్రతిజ్ఞ చేస్తూ, సమరం, విజయం అంటూ వందలాది సాయుధ దళాలు ఏర్పడి తమ గ్రామాల రక్షణ బాధ్యతను తీసుకున్నాయి. లేని జగతి కోసం అంకితం మా బతుకులు అని శ్రామిక జనావళి గెరిల్లా పోరాటం చేశారు. కూల్చి ప్రజా రాజ్య స్థాపన లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో మహత్తర సాయుధ పోరాటంగా మారింది. అన్యాక్రాంతమైన భూములను తిరిగి రైతులకు అప్పగించింది. బారెన్ బాస్టింగ్ పోరాట రూపంతో గిడ్డంగులపై దాడి చేసి ధాన్యాలను రైతులకు పంపిణీ చేసింది. వేల గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాలను పంపిణీ చేసింది. గ్రామ రాజ్య కమిటీలతో ప్రజా పాలన చేసింది. పోరుతో నిజాం రాచరిక ప్రభావం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం అయ్యింది. స్వతంత్రం వచ్చిన స్వతంత్ర రాజ్యంగా ఉంటానన్న ఉస్మాన్ అలీ ఖాన్ కలలను ఛిద్రం చేసింది. రాజ్యాన్ని కోరుకున్న రజాకార్లను అంతమొందించింది. రాజకీయ, సాంఘిక, ఆర్థిక మార్పులను తెచ్చి హైదరాబాద్ రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేసింది. కొమురయ్య అమరత్వం తదనంతర సమరశీలతతో తెలంగాణ సమాజం ఎన్నో ముందడుగులు వేసింది.
– శ్రీనివాస్




