అభివృద్ధి చెందుతున్న దేశాల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలపై పెరుగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడులు నేపథ్యంలో, దక్షిణ భూగోళం ప్రయోజనాలను పరిరక్షించే వ్యక్తిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టను బ్రెజిల్లో జూలై 6, 7 తేదీల్లో జరిగిన 17వ బ్రిక్స్ సదస్సు పాక్షికంగా పునరుద్ధరించడానికి సహాయపడింది.
ప్రధాని జూలై 2 పర్యటనలో ఘనా, ట్రినిడాడ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియాలకు అధికారిక సందర్శనలు ఉన్నాయి. సదస్సు ముగిసిన తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వాకు (ఆయననే లూలా అని పిలుస్తారు) ఆయన అధికారికంగా అతిథిగా కూడా ఉన్నారు. భారత ప్రధాని పర్యటన సందర్భంగా దక్షిణ భూగోళంలోని ఈ ఐదు దేశాలతో జరిగిన చర్చలు, సంతకాలు చేసిన ఒప్పందాలతో గ్లోబల్ సౌత్‌కు భారతదేశాన్ని స్నేహపూర్వక పెద్ద ఆర్థిక శక్తిగా నిలబెట్టడానికి సహాయపడ్డాయి.
భారతదేశ వైఖరిలో మార్పు, అంతర్జాతీయ సంబంధాలు
రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ సదస్సు సంయుక్త ప్రకటనలో గాజాలో ఇజ్రాయెల్ చర్యలను ఖండించడంలో, అలాగే ఇరాన్‌పై దాడులను ఖండించడంలో భారతదేశ వైఖరి మార్పు అనేది ముఖ్యమైన ఫలితం. అమెరికా పేరు చెప్పనప్పటికీ, ఈ తీర్మానంలో భారతదేశం సంతకం చేయడం గత వైఖరి కంటే ముందడుగు వేయడమే. పాలస్తీనావాసులను ఇజ్రాయెల్ హతమార్చడంపై, అలాగే ఇరాన్ ఎలాంటి కవ్వింపుకు పాల్పడనప్పటికీ అమెరికా ఆ దేశంపై దాడి చేసి, అణు సదుపాయాలలో పెద్ద భాగాన్ని కూల్చివేసిన విషయంలో అంతకు ముందు వైఖరికి ఇది భిన్నం.
ఈ ఏడాది జూలై 6,7 తేదీల్లో జరిగిన బ్రిక్స్ సదస్సు వరకు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌తో సహా దక్షిణ భూగోళంలోని ప్రముఖ దేశాల దృష్టిలో భారతదేశం అంటే ట్రంప్‌కు విశ్వసనీయ మిత్రదేశంగా, బ్రిక్స్ లేదా ఎస్సీఓ పనితీరు కంటే క్వాడ్‌పై ఎక్కువ ఆసక్తి చూపే దేశంగా సందేహాస్పదంగా ఉండేది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు నెతన్యాహును అరెస్టు చేయాలని, ఆయనను యుద్ధ నేరస్థుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారు. మన ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో ఆర్థిక, రక్షణ సంబంధాల విస్తరణ ప్రణాళికలను కొనసాగించింది. ఇజ్రాయెల్-యుద్ధం సమయంలో కూడా ఇజ్రాయెల్‌లో భారత కార్మికులు, సాంకేతిక నిపుణులను ఉద్యోగాలు చేయడానికి భారతదేశం అనుమతించింది.
బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు, ట్రంప్ సవాళ్లు
ఇప్పుడు రియో సదస్సులో దక్షిణ భూగోళ ప్రయోజనాలను గట్టిగా సమర్థించడం ద్వారా భారత ప్రధాని ప్రతిష్ట పాక్షికంగా పునరుద్ధరించబడిన ఆయన బ్రిక్స్ సమావేశంలో ఇచ్చిన వాగ్దానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయాలి. భారతదేశం 2026లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతదేశంలో సదస్సును నిర్వహిస్తారు. దక్షిణ భూగోళానికి సంరక్షకుడిగా ఈ పదవి ఆయనకు పెద్ద బాధ్యతలను అప్పగించింది. ఆయన దక్షిణ భూగోళ ప్రయోజనాలను నిరంతరం చూసుకోవాలి.
ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ట్రంప్ విధించిన ఏకపక్ష సుంకాల రేట్లను వ్యతిరేకించడం ద్వారా వాటి వాణిజ్య ప్రయోజనాలను రక్షించడమనేది ప్రధాన సమస్య. ఈ పోరాటానికి 2026లో 18వ బ్రిక్స్ సదస్సుకు అధ్యక్షుడిగా వస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వం వహించాలి. డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా బలమైన వైఖరి తీసుకోకుండా ఆయన ఈ పోరాటానికి నాయకత్వం వహించలేరు. అమెరికా అధ్యక్షుడి సహాయం పొందడానికి ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత ఆయన ఆ విధంగా చేస్తారా? ఈ ఏడాది చివర్లో అమెరికా ప్రాయోజిత క్వాడ్ సదస్సు భారతదేశంలో జరగనుంది. సదస్సులో పాల్గొంటారని భావిస్తున్న ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఆతిథ్యం ఇస్తున్న నరేంద్ర మోదీ సాధ్యమైన ప్రతిదీ చేయవలసి ఉంటుంది. 2026లో మళ్ళీ ఆయనే ఆతిథ్యం ఇవ్వాల్సిన బ్రిక్స్ సదస్సులోని కీలక సమస్యలకు భంగం వాటిల్లకుండా భారత ప్రధానమంత్రి ఈ క్వాడ్ సదస్సును ఎలా నిర్వహిస్తారు?
ట్రంప్ సుంకాలు, ప్రాంతీయ రాజకీయాలు
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై విచారణ పేరుతో అధ్యక్షుడు లూలా వెంటాడుతున్నాడని, అందుకు అమెరికాకు పంపే ఉత్పత్తులపై తమ ప్రభుత్వం 50% సుంకాన్ని విధిస్తుందని డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించారు. బ్రెజిలియన్ చట్టాల ప్రకారం జరుగుతున్న విచారణతో సుంకాల రేటును ముడిపెట్టడం ద్వారా ట్రంప్ బ్రెజిల్ అంతర్గత వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. బోల్సోనారో అధ్యక్షుడు లూలాకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన కఠినమైన మితవాద రాజకీయ నాయకుడు, ట్రంప్ అనుచరుడు, అలాగే నరేంద్ర మోదీ స్నేహితుడు. వాస్తవానికి, రాజకీయ విశ్లేషకులు ట్రంప్, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే, ఫ్రాన్స్ నేషనల్ ర్యాలీ సుప్రీమో మేరీ లీపెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచ పచ్చి మితవాద పక్షంలో భాగంగా చేర్చారు.
ట్రూత్ సోషల్ లో లేఖలను పోస్ట్ చేస్తూ, అమెరికా అధ్యక్షుడు బుధవారం మరో ఏడు దేశాలను, అంటే ఫిలిప్పీన్స్, బ్రూనై, మోల్డోవా, అల్జీరియా, లిబియా, ఇరాక్, శ్రీలంకలను లక్ష్యం చేసుకొని ఆగస్టు 1 నుంచి అమెరికాకు వాటి ఎగుమతులపై కఠినమైన సుంకాలను ప్రకటించారు. ఇప్పటివరకు భారతదేశం-వాణిజ్య ఒప్పందం కుదరలేదు. అయితే, చర్చలు తుది దశలో ఉన్నాయి. భారతదేశ వ్యవసాయ, పాల ఉత్పత్తుల రంగంలోకి ప్రవేశించడానికి భారతీయ చర్చల బృందంతో అమెరికా ఎలాంటి రాయితీలను రాబట్టిందో ఇంకా తెలియరాలేదు. చర్చలకై మూడోసారి భారత ప్రతినిధివర్గం వాషింగ్టన్కు వెళుతున్నది.
బోల్సోనారోకు వ్యతిరేకంగా న్యాయపరమైన చర్యలను నిలిపివేయాలన్న ట్రంప్ డిమాండ్‌ను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా తిరస్కరించాడు. బ్రెజిలియన్ దిగుమతులపై 50% సుంకం వాణిజ్య లోటును పూడ్చడం అవసరమని ట్రంప్ చేసిన వాదనను కూడా లూలా తిరస్కరించారు. వాస్తవానికి అలాంటి లోటు లేదు. ట్రంప్ ఆరోపణలకు అధ్యక్షుడు లూలా ఒక్కొక్క అంశం వారీగా సమాధానం ఇచ్చారు. బ్రెజిల్ స్వతంత్ర సంస్థలతో కూడిన సార్వభౌమ దేశం అని, ఏ రకమైన జోక్యాన్ని అంగీకరించబోదని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు బుధవారం డజన్ల కొద్దీ దేశాలపై సుంకాలను పెంచడానికి షెడ్యూల్ సిద్ధమైంది. ఈ వారం ప్రారంభంలో ఆయన తాజాగా మరో మూడు వారాల ఆలస్యమవుతుందని చెప్పి, ఆగస్టు 1 వరకు సమయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఆ రోజు నాటికి వైట్హౌజ్తో ఒప్పందం కుదుర్చుకోకపోతే దేశాలు ఎదుర్కొనే కొత్త రేట్లను ప్రకటించడం ప్రారంభించారు. బంగ్లాదేశ్, జపాన్, దక్షిణ కొరియాతో సహా 14 దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై 40 శాతం వరకు అమెరికా సుంకాలను ట్రంప్ సోమవారం ప్రకటించారు. ట్రంప్ బుధవారం మరో 11 దేశాలకు లేఖలు రాశారు.
బ్రిక్స్ సదస్సు ప్రకటన వెలువడిన వెంటనే, డాలరీకరణను ప్రోత్సహిస్తున్నాయని ఆ దేశాలపై 10 శాతం అదనపు సుంకాన్ని విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం భారతదేశాన్ని వెంటనే ప్రభావితం చేస్తుంది. కాబోయే బ్రిక్స్ అధ్యక్షుడిగా భారత ప్రధానికి ఈ అదనపు పెంపును, అలాగే బ్రెజిల్‌పై అనవసరమైన కారణాలతో భారీ 50 శాతం సుంకాన్ని విధించడాన్ని వ్యతిరేకించే తక్షణ బాధ్యత ఉంది. దక్షిణ భూగోళ నాయకుడిగా భారత ప్రధాని ఈ సున్నితమైన అంశంపై ట్రంప్‌కు సమాధానం ఇస్తారా, ఆయనను ఎదుర్కొంటారా?
భారతదేశ విదేశాంగ విధానం, భవిష్యత్ దిశ
భారతదేశానికి ఇప్పుడు తన విస్తారమైన జనాభా, వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో దక్షిణ భూగోళం సహజ నాయకుడిగా తన పాత్రను పోషించడానికి పెద్ద అవకాశం ఉంది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖకు వదిలేస్తే, దక్షిణ భూగోళం ప్రధాన చోదక శక్తిగా భారతదేశం తన పాత వైభవాన్ని తిరిగి పొందగలదు. కానీ, గత ఐదు సంవత్సరాలుగా భారత ప్రధాని పూర్తిగా తన సొంత సిద్ధాంతం ఆధారంగా విదేశీ దౌత్య ప్రణాళిక పనిని చేపట్టారు. ఇది దౌత్యపరమైన ఏకాకితనానికి దారితీసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారతీయ దౌత్యవేత్తలు మరింత ఇబ్బంది పడుతున్నారు.
భారతదేశం తన దౌత్య సవాళ్లను నిశితంగా సమీక్షించి, 2025, 2026లో దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మోదీ సిద్ధాంతాన్ని సవరించాల్సిన సమయం ఆసన్నమైంది. ట్రంప్ ప్రభుత్వం పెట్టిన ఒత్తిళ్లను ధిక్కరించడం ద్వారా, దక్షిణ భూగోళానికి నిజమైన నాయకుడిగా ఆవిర్భవించేందుకు, భారతదేశ విదేశాంగ విధానం భవిష్యత్ దిశను రూపొందించేందుకు 2026లో బ్రిక్స్ అధ్యక్ష హోదా భారతదేశానికి అరుదైన అవకాశాన్ని ఇచ్చింది. భారతదేశం తన వ్యూహాన్ని పునరుద్ధరిస్తుందా లేదా అమెరికాను అనుసరించే పాత మార్గాన్ని కొనసాగిస్తుందా అనేది మన శక్తిమంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆధారపడి ఉంటుంది.