కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఒక్కసారి రూ. 20 కడితే మనకి రూ. 2 లక్షలు వస్తాయి. ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. అసలు ఈ స్కీమ్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, అసలు రూ. 2 లక్షలు ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఈ స్కీమ్‌కి ఎలా అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేయాలి ఇవన్నీ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయినర్ ద్వారా చూద్దాం.
ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇక్కడ పేరులోనే ఉంది బీమా యోజన. బీమా అంటే ఇన్సూరెన్స్, యోజన అంటే స్కీమ్. సో ఇదొక ప్రభుత్వ ఇన్సూరెన్స్ స్కీమ్, అది కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. సంవత్సరానికి ఒక్కసారి రూ. 20 కట్టిన తర్వాత ఈ పాలసీ యాక్టివ్‌లో ఉంటుంది. అలా యాక్టివ్‌లో ఉన్న సమయంలో మనకి యాక్సిడెంట్ అయ్యి పొరపాటున చనిపోయినా, లేదా బ్రతికున్నా మనకి లేదా మన కుటుంబానికి ప్రభుత్వం రూ. 2 లక్షలు ఇస్తుంది. ఇది నార్మల్ ఇన్సూరెన్స్ కాదు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. యాక్సిడెంట్ అయ్యి చనిపోతే మాత్రమే మన కుటుంబానికి రూ. 2 లక్షలు వెళ్తాయి, లేదా యాక్సిడెంట్ అయ్యి వైకల్యం పొందితే మాత్రమే డబ్బులు వస్తాయి.
ఫస్ట్ కేసు: యాక్సిడెంట్ అయ్యి చనిపోయాం. అలాంటప్పుడు మన కుటుంబానికి రూ. 2 లక్షలు ఆ బ్యాంక్ ఇస్తుంది. ఏ బ్యాంకులో అయితే ఖాతాని ఓపెన్ చేశారో ఆ బ్యాంక్ మీ కుటుంబానికి రూ. 2 లక్షలు ఇస్తుంది. యాక్సిడెంట్ అంటే ఓన్లీ రోడ్ యాక్సిడెంట్ కాదు, ఉదాహరణకు ఫ్యాక్టరీలో పని చేస్తూ ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా డబ్బులు వస్తాయి.
రెండో కేసు: పర్మనెంట్ టోటల్ డిసబిలిటీ. యాక్సిడెంట్ అయ్యి రెండు చేతులు పోయినా, రెండు కాళ్లు పోయినా, లేదా రెండు కళ్ళు పోయినా, లేదా రెండు చెవులు పోయినా ఇలా ఏదైనా పార్ట్స్ రెండు పోతే దాన్ని పర్మనెంట్ టోటల్ డిసబిలిటీ అంటారు. అప్పుడు మీకు ఆ బ్యాంక్ రూ. 2 లక్షలు ఇస్తుంది.
మూడో కేసు: పర్మనెంట్ పార్షియల్ డిసబిలిటీ. యాక్సిడెంట్‌లో ఒక చేయి లేదా ఒక కాలు లేదా ఒక కన్ను పోయినట్లయితే, దానిని పర్మనెంట్ పార్షియల్ డిసబిలిటీ అంటాం. అలాంటప్పుడు బ్యాంక్ రూ. 1 లక్ష ఇస్తుంది. ఈ పథకం పేదవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళు బయట ప్రైవేటుగా టర్మ్ ఇన్సూరెన్సులు లేదా హెల్త్ ఇన్సూరెన్సులు తీసుకోలేరు. జస్ట్ రూ. 20 రూపాయలు కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవడం మంచిది.
ఈ స్కీమ్‌కి ఎలా అప్లై చేయాలి? మీకు ఏ బ్యాంకులో అయితే సేవింగ్స్ అకౌంట్ ఉందో లేదా పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ అకౌంట్ ఉన్నా, అక్కడికి వెళ్లి నాకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఖాతా కావాలని చెప్పండి. వాళ్లు ఒక ఫామ్ ఇస్తారు, దాన్ని ఫిల్ చేస్తే ఆటోమేటిక్‌గా అదే రోజు మీ బ్యాంకు ఖాతా నుండి రూ. 20 కట్ అవుతాయి. ప్రతి సంవత్సరం మే 31న ఈ డబ్బులు కట్ అవుతాయి. ఈ స్కీమ్ జూన్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు యాక్టివ్‌లో ఉంటుంది.
యాక్సిడెంట్ అయిన తర్వాత ఎలా అప్లై చేయాలి? యాక్సిడెంట్ అయిన 30 రోజులలోపు ఆ బ్యాంకుకి ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి. మనం చనిపోతే మన కుటుంబ సభ్యులు ఇన్ఫార్మ్ చేయాలి. క్లెయిమ్ ఫారమ్‌ని ఫిల్ చేసి బ్యాంకులో సబ్మిట్ చేయాలి. ఈ ఫామ్ గూగుల్‌లో దొరుకుతుంది. ఈ ఫామ్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్స్‌ని కూడా సబ్మిట్ చేయాలి. ఒకవేళ మరణం సంభవిస్తే క్లెయిమ్ ఫామ్, FIR, పోస్ట్ మార్టం సర్టిఫికెట్, నామినీ బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు పాలసీ నెంబర్‌ని సమర్పించాలి. ఒకవేళ డిసబిలిటీ అయితే క్లెయిమ్ ఫామ్, ప్రభుత్వ హాస్పిటల్ నుండి డిసబిలిటీ సర్టిఫికెట్, యాక్సిడెంట్ రిపోర్ట్, బ్యాంక్ వివరాలు, మరియు పాలసీ నెంబర్‌ని సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన 30-60 రోజులలోపు క్లెయిమ్ వస్తుంది.
రెండు లక్షల రూపాయలు సరిపోవు కాబట్టి దీనితో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కూడా తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఏ కారణం చేత చనిపోయినా మన కుటుంబానికి డబ్బు వెళ్తుంది, కానీ ఈ స్కీమ్‌లో కేవలం యాక్సిడెంట్ వల్ల మరణిస్తే మాత్రమే క్లెయిమ్ వస్తుంది. అదే విధంగా, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ముఖ్యం. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే, హాస్పిటల్ ఖర్చులన్నీ బీమా సంస్థ భరిస్తుంది, మీ సేవింగ్స్ ఖర్చు కావు.
ఒకవేళ మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ ఇవ్వకపోతే కంగారు పడకండి. బీమా భరోసా పోర్టల్ ద్వారా కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు. ఇది IRDAI కి చెందినది. ఇక్కడ మీ పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పిన్ కోడ్, కంప్లైంట్ టైప్, ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, పాలసీ నెంబర్ వంటి వివరాలను ఇచ్చి కంప్లైంట్ ఇవ్వవచ్చు. అప్పుడు IRDAI ఆ కంపెనీని వివరణ అడుగుతుంది, మరియు క్లైమ్ వచ్చేలా చూస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఏ కారణం చేత చనిపోయినా క్లెయిమ్ వస్తుంది, కానీ సురక్షా బీమా యోజనలో యాక్సిడెంట్ వల్ల మాత్రమే క్లెయిమ్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి.