prajapaksham

స్వాట్ తో తెలంగాణ సర్కార్ కు ప్రశంసలు

స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. సింపుల్‌గా స్వాట్. ప్రజాక్షేత్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. వీళ్లు రంగంలోకి దిగితే మొత్తం సీనే మారిపోతుంది.  హైదరాబాద్ పోలీసులు మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే.. మహిళా పోలీసులతో ఓ కొత్త ఫోర్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్విఫ్ట్ విమెన్ యాక్షన్ టీమ్.. ప్రధానంగా మహిళలు నిరసనలు, ఆందోళనలు చేసినప్పుడు వారిని సురక్షితంగా తరలించేందుకు తయారుచేస్తున్నారు. సాధారణంగా పురుష పోలీసులు మహిళా నిరనసకారులను నియంత్రించే విషయంలో కొన్నిసార్లు వివాదాలు తలెత్తుతున్నాయ్. అందువల్ల.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ కొత్త టీమ్‌ని రెడీ చేస్తున్నారు.
ఈ కొత్త ఫోర్స్‌లోని మహిళా పోలీసులకు.. సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. నిరనసలు, ఆందోళనల సమయంలో.. వారికేదైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వీరికి ఇచ్చే స్పెషల్ ట్రైనింగ్ ద్వారా.. క్లిష్ట పరిస్థితుల్లో గుంపులను నియంత్రించడంలో సహాయపడతారు. నిరసనలు, ఆందోళనల సమయంలో.. మహిళా నిరసనకారులను అదుపులోకి తీసుకోవడంలో.. వారిని తరలించడంలో చట్టబద్ధమైన, సున్నితమైన విధానాలను అనుసరించడమే ఈ టీమ్ లక్ష్యం.  ధర్నా సమయాల్లో మహిళలకు, మహిళా వీఐపీలకు రక్షణ ఇచ్చే విషయంలో.. ఈ మహిళా పోలీసులు ప్రత్యేక శిక్షణ పొందారు.  ట్రైనింగ్‌లో వాళ్లు నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ కిట్స్‌ని కూడా ప్రదర్శించారు. 

Recent Post

Andhra Pradesh National