prajapaksham

భీకర పోరు

దుబాయ్: టెహ్రాన్ ఇరాన్ ప్రభుత్వ లక్షాలపై యాభైకి పైగా యుద్ధ విమానాలతో సామూహిక దాడులు చేసినట్లు సోమవారంనాడు ఇజ్రాయెల్ సైనిక దళం (ఐ డి ఎఫ్) ప్రకటించింది. అంతకుముందురోజు ట్రంప్ పాలనాయంత్రాంగం ఇరాన్ అణుస్థావరాలపై సామూహిక దాడులు చేసిన నేపధ్యంలో ఇరాన్ తన సాలో క్షిపణులను, డ్రోన్లను ఉపయోగించి వరుస దాడులు చేయడంతో ఇజ్రాయెల్ ఈ ఎదురుదాడులు చేసింది. ఫోర్డో అణుశుద్ధి కేంద్రానికి వెళ్ళేందుకు వీలుగా ఆ చుట్టుపక్కల నిర్మించిన రహదారులన్నింటినీ ధ్వంసం చేసినట్లు ధృవీకరించింది. ఇజ్రాయెల్ మరిన్ని దాడులు చేసిన ఇరాన్ ప్రభుత్వ వ్యవస్థలపైన, టెహ్రాన్ పేరుమోసిన నేరస్థులకు నిలయమైన ఎవిన్ జైలుపైనా సోమవారంనాడు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. తమ సైన్యానికి ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ ఉందని, అమెరికా,ఇజ్రాయెల్ లక్షాలను దెబ్బతీస్తామని ఇరాన్ తొలుత ప్రకటించడంతో ఆగ్రహించిన ఐ డి ఎఫ్ ఈ దాడులకు దిగింది. టెహ్రాన్ బాలిస్టిక్ లాంచర్ వ్యవస్థలు, కీలక ప్రబుత్వ కార్యాలయాలు, అంతర్గత భద్రతా వ్యవస్థ కార్యాలయాలను ధ్వంసం చేసింది. ఇరాన్ సైనికపాటవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే అసాధారణమైన సైనికపాటవంతో విస్తృత దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణమంత్రి కట్జ్ చెప్పారు. తమ దేశంలోకి చొరబడి దాడులు చేసినందుకుగాను పూర్తిస్థాయి బలగాలను ఉపయోగించి ఇరాన్ నియంత ఖమేనీని శిక్షిస్తామన్నారు. సైనిక స్థావరాలకు దూరంగా వెళ్ళిపోవాలని ఇరాన్ ప్రజలకు మరోవైపు ఐ డి ఎఫ్ హెచ్చరిక చేసింది. దాదాపు 100 ఆయుధ సామాగ్రి కేంద్రాలపై ఐ డి ఎఫ్ దాడులు సాగాయి. ఐఆర్ తమ భద్రతకు ప్రమాదం పొంచి ఉన్నందువల్లనే ముందస్తు దాడులు చేశామని వివరణ ఇచ్చింది. ఐఆర్ భాగమైన సయ్యద్ అల్ కార్ప్ కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు చెప్పింది. ఇరాన్ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కేంద్రాలు బాగా నష్టపోయాయి.
ముఖ్యంగా ఎవిన్ జైలుపై దాడిని ఖైదీల బంధువులు తీవ్రంగా ఖండించారు. తమ ప్రియతములైన కుటుంబ సభ్యులు ఏమైపోయారో తెలియక ఆందోళన వ్యక్తం చేశారు. పలు దేశాలకు చెందిన ఖైదీలు ఈ ఎవిన్ జైలులో బందీలుగా ఉన్నారు. ఈ జైలులో రాజకీయ ఖైదీలు ప్రధానంగా ఉన్నారు. పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ ఈ జైలును నడుపుతోంది. ఈ జైలు తాలూకూ సమాచారాన్ని ఇరాన్ సర్వాధినేత ఖమేనికీ మాత్రమే నేరుగా తెలియజేస్తారు. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ విధించిన ఆంక్షలను లక్షంగా చేసుకుని ఈ జైలును ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. జైలులో కొన్ని భాగాలు ధ్వంసమయ్యాయని, తర్వాత బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని నియంత్రించి వ్యవస్థను తమ అదుపులోకి తెచ్చుకున్నట్లు ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన వెబ్ ప్రకటించింది. శక్తిమంతమైన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ఫ్ (ఐఆర్ చెందిన థార్ అల్లా కేంద్ర కార్యాలయ కమాండ్ సెంటర్ గగనతల దాడులను, ఎవిన్ జైలుపై దాడులను పలు దేశాలు ఖండించాయి.
ఇదిలా ఉండగా,ఇరాన్ అణుస్థావరాలపై దాడిచేసిన అమెరికా ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదని నాటో చీఫ్ మార్క్ రట్టో ప్రకటించారు. మరోవైపు చమురు ధరల పెరుగుదలపై ట్రంప్ ప్రకటన చేస్తూ ఈ ధరలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ దృష్టి కేంద్రీకరించాలని కోరారు.
దాడికి ముండే అణు పదార్థాలను తరలించిన ఇరాన్
అమెరికా దాడుల తర్వాత వియన్నాలోని ఐఎఇఎ ప్రధానకేంద్రంలో భయాలు నెలకున్నాయి. ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్న ఫోర్డో కేంద్రం మరింత ధ్వంసమవుతుందని అంచనావేస్తున్నట్లు ఐఎఇఎ ప్రధానాధిపతి రాఫెల్ గ్రాస్సి అన్నారు. కాగా ఫోర్డో అణుస్థావరం సహా మిగిలిన రెండు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడానికి ముందుగానే అణుశుద్ధికి ఉపయోగపడే యురేనియమ్ ఇతర పదార్థాలను అక్కడి నుండి తరలించామని అనేకమంది ఇరాన్ అధికారులతోపాటు ఇరాన్ అణుశక్తిసంస్థ అధికార ప్రతినిధి బెహ్రౌజ్ కమల్వంది చెప్పారు. అణు పదార్థాలు, ఇతర అణుసంబంధ పరికరాల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జూన్ 13వ తేదీకి ముందుగానే ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాఘ్చి తమకు తెలియజేశారని ఐఎఇఎ గవర్నర్స్ బోర్డు సమావేశంలో గ్రాస్సీ చెప్పారు.
సోమవారంనాడు ఇజ్రాయెల్ కొత ్తతరహాలో దాడులు చేసినట్లు ఇరాన్ పేర్కొంది. “ట్రూ ప్రామిస్ 3” ఆపరేషన్ పేరుతో ఈ దాడులు చేశామని ఇజ్రాయెల్ హైఫా, టెల్ అవీవ్ నగరాలపై లక్షంగా చేసకుని దాడులు జరిగాయని తెలిపింది. జెరూసలెంలో భారీ పేలుడు శబ్దాలు అందరికీ వినిపించాయి. ఈ దాడులకు ముందుగా సోమవారం ఉదయం ఇరాన్ సాయుధ బలగాల సంయుక్త ప్రధానాధిపతి జనరల్ అబ్దుల్హ్రీం మౌసావీ ఒక ప్రకటన చేస్తూ, అమెరికాకు, అమెరికా సైన్యానికి వ్యతిరేకండా దాడులు చేసేందుకు ఇరాన్ బలగాలకు సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చామన్నారు.

Recent Post

Andhra Pradesh National